News August 6, 2024

యూన‌స్ అంగీకరించారు: బంగ్లా మీడియా

image

బంగ్లాలో ఏర్పాటయ్యే మ‌ధ్యంతర ప్ర‌భుత్వానికి ప్రధాన స‌ల‌హాదారుగా ఉండేందుకు ప్ర‌ముఖ సామాజిక‌వేత్త మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్ అంగీక‌రించిన‌ట్టు ఆ దేశ మీడియా తెలిపింది. బంగ్లాలో మ‌హిళ‌ల‌ను పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు యూన‌స్ గ్రామీణ బ్యాంకు ద్వారా చేసిన కృషికి గుర్తింపుగా 2006లో ఆయనకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి దక్కింది. ఈయ‌న అమెరికాకు అనుకూలుడనే ముద్ర ఉంది.

Similar News

News November 2, 2025

వంటింటి చిట్కాలు

image

* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వెయ్యడం వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.

News November 2, 2025

జోగి రమేశ్ అనుచరుడిని వదిలేసిన పోలీసులు

image

AP: జోగి రమేశ్ <<18175158>>అనుచరుడు<<>> ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు వదిలిపెట్టారు. తిరిగి తాము పిలిచినప్పుడూ విచారణకు రావాలని ఆదేశించినట్లు రాము తెలిపారు. రమేశ్ సోదరుడు జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు తనను తీసుకెళ్లారని పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్తో తనకు, జోగి రమేశ్‌కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పారు. జనార్దన్కు ఫోన్ చేసి మాట్లాడేంత పరిచయం రమేశ్‌కు లేదన్నారు.

News November 2, 2025

MECONలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

image

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<>MECON<<>>) 4 సీనియర్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3 నుంచి డిసెంబర్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.meconlimited.co.in/