News August 16, 2024
మోదీకి ఫోన్ చేసిన యూనస్
ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లా మధ్యంతర ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఫోన్ చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఇరువురూ చర్చించుకున్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మెరుగుపడేందుకు అవరసమైన సహకారాన్ని అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. బంగ్లాలోని హిందువులు, ఇతర మైనారిటీల రక్షణకు చర్యలు చేపడతామని యూనస్ తనతో చెప్పినట్లు మోదీ ట్వీట్ చేశారు.
Similar News
News September 11, 2024
భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి కానుందా?
TG: చెరువులు, నాలాలకు సమీపంలో భవనాల నిర్మాణాలకు ‘హైడ్రా’ అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది. హైడ్రా నుంచి NOC ఉంటేనే నిర్మాణాలు చేపట్టేలా నిబంధనలను సవరించనున్నట్లు సమాచారం. ఒకవేళ అక్రమంగా నిర్మిస్తే ఇంటి నంబర్, నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరని అధికార వర్గాలు చెబుతున్నాయి.
News September 11, 2024
విశాఖకు మరో వందేభారత్
విశాఖ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా SEP 15 నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి దుర్గ్(ఛత్తీస్‌గఢ్)కు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది. ఉ.6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి రాయ్‌పూర్, మహాసముంద్, రాయగడ, విజయనగరం మీదుగా మ.1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మ.2.55 గం.కు బయల్దేరి రా.10.50 గం.కు దుర్గ్ చేరుకుంటుంది.
News September 11, 2024
సీఎం రేవంత్ సొంత గ్రామంలో సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టు
TG: సీఎం రేవంత్ సొంత గ్రామం నాగర్ కర్నూల్(D) కొండారెడ్డిపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని TGSPDCL CMD వెల్లడించారు. కొండారెడ్డిపల్లిలో సర్వే చేశామని, త్వరలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఉచిత సౌర విద్యుత్ పంపుసెట్లు పంపిణీ చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ప్రతి పల్లెలో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు.