News February 6, 2025

నాటోకు జెలెన్‌స్కీ అల్టిమేటం

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటో, పశ్చిమ దేశాలకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. తమకు అణ్వాయుధాలో లేక నాటోలో సభ్యత్వమో ఏదొకటి త్వరగా తేల్చాలని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘ఓవైపు రష్యా మాపై దూకుడు పెంచుతుంటే మాకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు? ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణుల్నైనా మాకు ఇవ్వాలి. మమ్మల్ని మేం రక్షించుకునేదెలా?’ అని ప్రశ్నించారు.

Similar News

News February 6, 2025

జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం.. TDP సంచలన ట్వీట్

image

AP: లిక్కర్ స్కాంపై ఉదయం సిట్ పడగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని TDP ప్రశ్నించింది. ‘సిట్ తనవరకు వస్తుందని స్కాంకి సంబంధించి రాసుకున్న డాక్యుమెంట్లు తగలబెట్టారా? నిన్న సాయంత్రం జరిగితే ఇంకా CC ఫుటేజీ ఎందుకు బయటపెట్టలేదు? తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్’ అని ట్వీట్ చేసింది.

News February 6, 2025

అందుకే సాయి పల్లవిని ‘తండేల్’కు తీసుకున్నాం: అల్లు అరవింద్

image

తండేల్ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి వంద శాతం న్యాయం చేశారని నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సాయి పల్లవిని హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసింది నేనే. ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు ఈ పాత్రకు న్యాయం చేయలేరని నాకు అనిపించింది. ఎన్నో భావోద్వేగాల్ని పండించాల్సిన పాత్ర కావడంతో సాయి పల్లవే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నాం. ఈ పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుండిపోతుంది’ అని కొనియాడారు.

News February 6, 2025

పాక్‌పై ఓడితే గుచ్చి గుచ్చి అడుగుతారు: రవి శాస్త్రి

image

భారత్-పాక్ మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని, అన్ని మ్యాచుల్లాగే దాన్నీ పరిగణిస్తామన్న కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘కోచ్‌గా ఉన్నప్పుడు నేనూ మీడియాకు ఇదే మాట చెప్పేవాడిని. కానీ నిజమేంటంటే పాక్‌పై గెలవడం చాలా కీలకం. ఆ జట్టుపై ఎన్ని మ్యాచులు గెలిచినా ఒక్క మ్యాచ్ ఓడితే చాలు పాతవన్నీ మర్చిపోయి ఓటమి గురించే అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!