News July 15, 2024
బిలియనీర్ల క్లబ్‌లోకి జొమాటో సీఈఓ
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. ఈరోజు ట్రేడింగ్‌లో జొమాటో షేర్లు 2%కుపైగా వృద్ధిని నమోదు చేయడంతో ఆయన నికర సంపద 1 బిలియన్ ₹8,300కోట్లు దాటింది. 2023 జులై నుంచి జొమాటో షేర్ల విలువ దాదాపు 300% పెరిగింది. కాగా గోయల్‌కు సంస్థలో 36.95 కోట్ల షేర్లు (4.24 శాతం వాటా) ఉన్నాయి. జొమాటోకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వృద్ధి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 11, 2024
ఏపీకి తెలంగాణ విత్తనాలు
తెలంగాణ నుంచి ఏపీకి 15వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు రానున్నాయి. ప్రస్తుత ఏపీ అవసరాల దృష్ట్యా మంత్రి అచ్చెన్నాయుడి విజ్ఞప్తితో కిలో రూ.90 చొప్పున అమ్మేందుకు TG మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, హమాలీ సహా అన్ని ఖర్చులు కలిపి రూ.86 చొప్పున గిట్టుబాటు అవుతుండగా, ఏపీకి ఎగుమతి చేయడంతో కిలో రూ.4 లాభం తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు లభించనుంది.
News October 11, 2024
IR ప్రకటించాలని ఉద్యోగుల డిమాండ్
AP: దసరా కానుకగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ DAలు, PRC, IR ప్రకటించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా దసరా కానుకగా IR ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. నూతన వేతన సవరణ కోసం కమిటీకి వెంటనే ఛైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వం వేసిన కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు పేర్కొంది.
News October 11, 2024
ఫేమస్ వెబ్‌సైట్ హ్యాక్: 3 కోట్ల పాస్‌వర్డ్స్ చోరీ
Internet Archive వెబ్‌సైట్‌పై ప్రో పాలస్తీనా హ్యాకర్లు దాడిచేశారు. 3.1 కోట్ల మంది పర్సనల్ డేటా, ఈ-మెయిల్ అడ్రస్‌లు, స్క్రీన్ నేమ్స్, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్స్‌ను చోరీచేశారు. అక్టోబర్ 9న జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఆధారంగా హ్యాకర్లు డేటాబ్రీచ్‌కు పాల్పడ్డారు. వారి నుంచి 6.4GB డేటాబేస్ అందినట్టు Have I Been Pwned? ఫౌండర్ ట్రాయ్ హంట్ తెలిపారు. తామే హ్యాకింగ్ అటాక్స్ చేశామని SN_BlackMeta తెలిపింది.