News April 24, 2024

వినియోగదారులకు జొమాటో షాక్!

image

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి ప్లాట్‌ఫామ్‌ ఫీజుగా ప్రతి ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రధాన మార్కెట్లలో ఇది మొదలైంది. మరో డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ ఫీజు పేరిట రూ.5 విధిస్తోంది. ఇక నగరాల మధ్య చేపట్టే ‘ఇంటర్‌సీటీ’ ఫుడ్ డెలివరీని ఆపేస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. న్యాయపరమైన సమస్యలే దీనికి కారణమని తెలిపింది.

Similar News

News July 8, 2025

ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్

image

TG: తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీ‌లో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు. ‘రైతు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రమ్మని చెబితే సీఎం ఢిల్లీ వెళ్లారు. ఆయన బదులు మంత్రులు ఎవరైనా వస్తారని భావిస్తున్నా. ఎవరొచ్చినా చర్చకు సిద్ధం. అక్కడే ఎదురుచూస్తాం. సీఎం ఇంకో రోజు టైమ్ ఇచ్చినా చర్చకు వస్తాం’ అని తెలిపారు.

News July 8, 2025

చెల్లెలు లాంటి నాపై ప్రసన్న నీచపు వ్యాఖ్యలు: ప్రశాంతి

image

AP: వరుసకు చెల్లెలు అయ్యే తనపై YCP నేత నల్లపురెడ్డి <<16985283>>ప్రసన్న<<>> కుమార్ రెడ్డి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని TDP MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న ప్రసన్నను కోర్టుకు ఈడుస్తానని ఆమె హెచ్చరించారు. ‘ప్రతీసారి VPRకు డబ్బు ఉందని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. ఆయనకు లేవా డబ్బులు? ఏమైనా అడుక్కు తింటున్నారా? అనిల్‌కు కూడా జైలు శిక్ష తప్పదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

News July 8, 2025

ఎల్లుండి నుంచి 16 బోగీలతో కాచిగూడ వందేభారత్

image

కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు బోగీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 7 ఛైర్‌కార్, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో 8 బోగీలు ఉండగా, ఈ నెల 10వ తేదీ నుంచి 14CC, 2 EC కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి పెరగనుంది. కాగా బుధవారం మినహా ప్రతిరోజూ ఈ రైలు ఉ.5.45కు కాచిగూడలో బయల్దేరి మ.2 గంటలకు యశ్వంత్‌పూర్, అలాగే మ.2.45కు అక్కడ బయల్దేరి రా.11 గంటలకు కాచిగూడ చేరుతుంది.