News July 5, 2024
‘ఎక్స్‌ట్రీమ్’ డెలివరీ సేవల్ని నిలిపేసిన జొమాటో?
గత ఏడాది అక్టోబరులో ప్రారంభించిన ‘ఎక్స్‌ట్రీమ్’ సేవల్ని జొమాటో నిలిపేసినట్లు సమాచారం. ది ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. డిమాండ్ లేని కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌ను తొలగించింది. అయితే దీనిపై సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జొమాటో క్రియాశీలంగా ఉన్న నగరాల్లో ఆహార డెలివరీ ఏజెంట్లతోనే చిన్న ప్యాకేజీలను డెలివరీ చేసేందుకు ఎక్స్‌ట్రీమ్‌ను సంస్థ ప్రారంభించింది.
Similar News
News December 12, 2024
BREAKING: వైసీపీకి మరో షాక్
AP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని <<14855229>>వీడిన<<>> విషయం తెలిసిందే.
News December 12, 2024
జమిలి ఎన్నికలకు క్యాబినెట్ ఆమోదం
దేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. గతంలో కోవింద్ కమిటీ సిఫారసులకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
News December 12, 2024
బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైంది: బండి సంజయ్
తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాసరలో లడ్డూలు అందట్లేదు. కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేదు. పండుగలపై ఆంక్షలు పెరుగుతున్నాయి’ అని Xలో విమర్శించారు. కాంగ్రెస్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? లేక ప్రభుత్వమే ఈ దాడిని చేయిస్తోందా? అని ప్రశ్నించారు.