News August 27, 2024
బాంబు పేల్చిన జుకర్‌బర్గ్!

కొవిడ్ సంబంధిత కంటెంట్, పోస్టులను సెన్సార్ చేయాలని బైడెన్, హ్యారిస్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని వైట్‌హౌస్ జుడీషియరీ కమిటీకి ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ లేఖ రాశారు. అలా ఒత్తిడి చేయడం తప్పన్నారు. ఇన్నాళ్లూ బహిరంగంగా ఈ విషయం చెప్పనందుకు పశ్చాత్తాపం చెందారు. కొవిడ్‌పై హ్యూమర్, సెటైరికల్ పోస్టులు వస్తే ప్రభుత్వం తమపై తెగ చిరాకు పడేదన్నారు. ఇష్టం లేకున్నా కొన్నిమార్పులు చేయాల్సి వచ్చిందన్నారు.
Similar News
News January 19, 2026
ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

యాదాద్రి కలెక్టర్ హనుమంతు రావు సోమవారం పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బంది హాజరును పర్యవేక్షించారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
News January 19, 2026
గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. గ్యారంటీ లేకుండా ₹10 వేల లోన్!

డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల వంటి గిగ్ వర్కర్లు, డొమెస్టిక్ హెల్పర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ లోన్ స్కీమ్‌ను తెచ్చే యోచనలో ఉంది. PM-SVANidhi తరహాలో ఏప్రిల్ 2026 నుంచి వీరికి ₹10,000 వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా లోన్లు అందించే అవకాశం ఉంది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. సకాలంలో చెల్లిస్తే ₹50,000 వరకు మళ్లీ లోన్ పొందే అవకాశం ఉంటుంది.
News January 19, 2026
రికార్డు స్థాయిలో పడిపోయిన చైనా జనాభా

చైనాలో వరుసగా నాలుగో ఏడాదీ జనాభా క్షీణించింది. 2025లో 33.9 లక్షలు తగ్గి 140.5 కోట్లకు చేరింది. జననాల రేటు 5.63గా నమోదై రికార్డుస్థాయికి పడిపోయింది. మరణాల రేటు మాత్రం 8.04తో 1968 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది. యువత పెళ్లిళ్లపై విముఖత చూపడం, పెరిగిన జీవనవ్యయం వల్ల దంపతులు పిల్లలు వద్దనుకోవడం ఇందుకు కారణాలు. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా, ‘ముగ్గురు పిల్లల’ విధానం తెచ్చినా మార్పు రాలేదు.


