News April 24, 2024
జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌ను కొన్నది ఎందుకంటే..

2010లో లాంఛ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో మార్క్ జుకర్‌బర్గ్ కొనుగోలు చేశారు. అలా ఎందుకు కొన్నారు? తాజాగా లీకైన ఆయన ఈమెయిల్స్‌లో ఆ ప్రశ్నకు జవాబు ఉందని సీఎన్‌బీసీ నివేదిక చెప్పింది. మున్ముందు ఇన్‌స్టా తమకు పోటీదారు అవుతుందని బర్గ్ భావించారట. మొబైల్ యాప్‌లలో ఇన్‌స్టా రాణిస్తుందని అంచనా వేసి కొన్నారట. బిలియన్ డాలర్లకు ఆయన దాన్ని కొనగా.. ఇప్పుడు ఇన్‌స్టా విలువ 500 బిలియన్ డాలర్లకు పైమాటే!
Similar News
News November 1, 2025
ఎల్లుండి నుంచి మెట్రో రైలు సమయాల్లో మార్పు

TG: మెట్రో రైలు సమయాల్లో మార్పు చోటు చేసుకోనుంది. తొలి ట్రైన్ ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి మొదలవుతాయని L&T హైదరాబాద్ మెట్రో పేర్కొంది. ఎల్లుండి నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో తెలిపింది. అంతకుముందు తొలి ట్రైన్ ఉదయం 6గంటలకు, చివరి ట్రైన్ రాత్రి 11:45గంటలకు మొదలైన సంగతి తెలిసిందే.
News November 1, 2025
ఢిల్లీలో వాయు కాలుష్యంతో 17,188 మరణాలు

ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఏడింటిలో ఒక మరణానికి వాయుకాలుష్యమే కారణంగా ఉంది. 2023లో వాయుకాలుష్యం వల్ల 17,188(15%) మంది మరణించినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యూయేషన్(IHME) నివేదిక తెలిపింది. అదే ఏడాది హైబీపీతో 12.5%, మధుమేహంతో 9శాతం, అధిక కొలెస్ట్రాల్‌తో 6%, ఊబకాయంతో 5.6శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. 2018-24 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఉంది.
News November 1, 2025
కాశీబుగ్గ ఘటన.. మృతులు వీరే

AP: 1.ఏడూరి చిన్నమ్మి(50)-రామేశ్వరం(టెక్కలి), 2.రాపాక విజయ(48)-పిట్టలసరి(టెక్కలి), 3.మురిపింటి నీలమ్మ(60)-దుక్కవానిపేట-పల్లిఊరు(వజ్రపుకొత్తూరు), 4.దువ్వు రాజేశ్వరి(60)-బెలుపతియా(మందస), 5.చిన్ని యశోదమ్మ(56)-శివరాంపురం(నందిగం), 6.రూప-గుడ్డిభద్ర(మందస), 7.లోట్ల నిఖిల్(13)-బెంకిలి(సోంపేట), 8.డొక్కర అమ్ముదమ్మ-పలాస, 9.బోర బృందావతి(62)- మందస. మరో వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందగా వివరాలు తెలియాల్సి ఉంది.


