News April 24, 2024
జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌ను కొన్నది ఎందుకంటే..

2010లో లాంఛ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో మార్క్ జుకర్‌బర్గ్ కొనుగోలు చేశారు. అలా ఎందుకు కొన్నారు? తాజాగా లీకైన ఆయన ఈమెయిల్స్‌లో ఆ ప్రశ్నకు జవాబు ఉందని సీఎన్‌బీసీ నివేదిక చెప్పింది. మున్ముందు ఇన్‌స్టా తమకు పోటీదారు అవుతుందని బర్గ్ భావించారట. మొబైల్ యాప్‌లలో ఇన్‌స్టా రాణిస్తుందని అంచనా వేసి కొన్నారట. బిలియన్ డాలర్లకు ఆయన దాన్ని కొనగా.. ఇప్పుడు ఇన్‌స్టా విలువ 500 బిలియన్ డాలర్లకు పైమాటే!
Similar News
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘భోళాశంకరుడు’’

శివుడు సులభప్రసన్నుడు. ఆయనను మెప్పించడానికి భారీ కానుకలు, పెద్ద పూజలు అవసరం లేదు. స్వచ్ఛమైన మనసుతో చిన్న బిల్వ పత్రం సమర్పించినా, గుక్కెడు నీళ్లతో అభిషేకం చేసినా ఆయన పరవశించిపోతాడు. భక్తుడు తన కష్టాలను చెప్పుకుంటే చాలు.. ఏ మాత్రం ఆలోచించకుండా అడిగిన వరాలను ఇచ్చేస్తాడు. అందుకే భక్తులు ఆయనను అమాయకుడైన దేవుడిగా, ప్రేమగా ‘భోళాశంకరుడు’ అని పిలుచుకుంటారు. హృదయ శుద్ధి మాత్రమే ఆయన కోరుకునే ఏకైక దక్షిణ.
News February 12, 2026
హగ్ డే స్పెషల్.. CSK నుంచి స్పెషల్ పోస్ట్

నేడు ‘హగ్ డే’ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ మైదానంలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ, స్మృతి- హర్మన్, ధోనీ- జడేజా, టెండూల్కర్-ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లు కౌగిలించుకున్న అరుదైన చిత్రాలను CSK తన X ఖాతాలో పంచుకుంది. గెలుపు సమయంలో పొంగివచ్చే సంతోషాన్ని ఈ ఫొటోలు ప్రతిబింబిస్తున్నాయి.
News February 12, 2026
సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్.. తేడాలేంటో తెలుసా?

సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఇద్దరూ మానసిక ఆరోగ్యనిపుణులే అయినప్పటికీ చదువు, చికిత్స పద్ధతుల్లో తేడాలు ఉంటాయి. సైకియాట్రిస్టులు డాక్టర్లు (MBBS/MD). వీరు మందుల ద్వారా చికిత్స చేస్తారు. మరోవైపు సైకాలజిస్టులు ప్రొఫెషనల్ వైద్యులు కాదు. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలను టాక్ థెరపీ/కౌన్సెలింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. వీరికి మందులు రాసే అధికారం ఉండదు.


