News February 7, 2025
అనకాపల్లి: పోలీసులకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ
అనకాపల్లి జిల్లాలో పోలీసులకు ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం జిల్లా కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ ఎస్పీ ముందు హాజరై వారి వ్యక్తిగత అనారోగ్య సమస్యలను తెలిపారు. ఈ మేరకు విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Similar News
News February 8, 2025
మెదక్: కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తి అరెస్టు
భార్య, బామ్మార్దిని కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేగోడ్ ఎస్ఐ పోచయ్య తెలిపారు. రేగోడ్‌కు చెందిన ద్యారంగుల వెంకయ్య ఈ నెల 3న భార్యతో గోడవపడ్డాడు. ఈ ఘటనలో భార్య నాగమణి, బావ మరిది గురువయ్యను వెంకయ్య కత్తితో పొడిచి పారిపోయాడు. గాయపడిన ఇద్దరిని సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు వెంకయ్యను శుక్రవారం అరెస్టు చేసి రిమండ్ తరలించిన పోలీసులు తెలిపారు.
News February 8, 2025
ఆలేరు: బస్సులో కండక్టర్ పుస్తెలతాడు చోరీ..
జనగాం నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ వెళ్లే బస్సులో పుస్తెలతాడు అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జనగాం డిపోకు చెందిన TS27Z0028 నంబర్‌గల బస్సులో మహిళా కండక్టర్ ఉమామహేశ్వరికి చెందిన సుమారు మూడు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై మహేశ్వరి ఆలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 8, 2025
కొత్త ఐటీ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం!
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీన్ని సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. అనంతరం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలిపాయి. ఈ చట్టంలో అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించిన విషయం తెలిసిందే.