News March 11, 2025
అనర్హులని తేలితే ఏదశలో ఉన్నా ఇల్లు రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసి పనులు ప్రారంభించామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పనులు ప్రారంభించామని.. లబ్ధిదారులు అనర్హులని తేలితే నిర్మాణం ఏ దశలో ఉన్నా ఎలాంటి ఆలోచన లేకుండా ఇల్లు రద్దు చేస్తామని తేల్చిచెప్పారు.
Similar News
News March 11, 2025
వరంగల్ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

వరంగల్ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.
News March 11, 2025
బోరుగడ్డకు బెయిల్ ఇవ్వొద్దు: పోలీసులు

సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్‌కు బెయిల్ ఇవ్వొద్దని నాలుగో పట్టణ పోలీసులు అనంతపురం ఎక్సైజ్ కోర్టుకు విన్నవించారు. తల్లికి అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్ పొందిన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, తప్పుడు పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై హైకోర్టులో తేలేవరకు విచారణను పెండింగ్‌లో ఉంచుతున్నట్లు న్యాయాధికారి తెలిపారు.
News March 11, 2025
ప్రణయ్ హత్య కేసులో తీర్పు.. అమృత స్పందన ఇదే..

TG: ప్రణయ్ <<15710208>>హత్య కేసులో<<>> కోర్టు నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రణయ్ భార్య అమృత ఇన్‌స్టాగ్రాంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. నిన్నటి తేదీని ఉద్దేశించి ‘రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్’ అని రాసుకొచ్చారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత తండ్రి మారుతీరావు 2018లో సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు.