News January 25, 2025

అవార్డు గ్రహీతకు కలెక్టర్ ప్రశంసలు 

image

ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తూ  జైవిక్ ఇండియా అవార్డు -2025 ను అందుకున్న ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుకుంటకు చెందిన ఒబిలిశెట్టి గోపాల కృష్ణమూర్తిని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం అభినందించారు. బెంగుళూరులో యోగ్యత కేంద్రం ప్రతినిధుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న గోపాల కృష్ణమూర్తి, కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆమె ప్రశంసలు పొందారు.

Similar News

News March 15, 2025

అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్?

image

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారని తెలుస్తోంది. ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉంటుందని బీసీసీఐ వర్గాల సమాచారం. దీనిపై బీసీసీఐ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని టాక్. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన BGTలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా 1-3 తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్లు వినిపించాయి.

News March 15, 2025

దామరచర్ల: గ్రూప్-2, 3లో సత్తాచాటిన శశి కుమార్

image

దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం గ్రామానికి చెందిన రాయికింది శశి కుమార్ ఇటీవలే వెలువడిన గ్రూప్-3 ఫలితాలలో 19 రాంక్, గ్రూప్-2లో 12 ర్యాంక్ సాధించాడు. శశి కుమార్ తండ్రి రామ్మూర్తి మిర్యాలగూడ ట్రాన్స్ కో లైన్మెన్‌గా పని చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహకంతోనే ర్యాంకు సాధించానని శశికుమార్ తెలిపారు. శశికుమార్‌ను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

News March 15, 2025

NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

image

సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30న సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

error: Content is protected !!