News March 15, 2025

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని

image

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో శనివారం రోజు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూర్చొని అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తున్న సమయంలో ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని ఉండడం పట్ల సీపీఐ నాయకులు, కొత్తగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 16, 2025

రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

image

ఆసుపత్రుల్లో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సుధీర్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వేసవి నేపథ్యంలో ఫ్యాన్లు, తాగునీరు, మొదలగు సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

News March 16, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 16, ఆదివారం ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు ఇష: రాత్రి 7.38 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 16, 2025

MNCL: అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు సాయి శ్రీవల్లి

image

మంచిర్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి శ్రీవల్లి అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు ఎంపికైంది. జూన్ 15 నుంచి 21వరకు జపాన్‌లో జరిగే సకురా అంతర్జాతీయ సైన్స్ సదస్సులో ఆమె పాల్గొననుంది. స్త్రీల నెలవారి రుతుక్రమం ప్రక్రియలో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి శ్రీజ సొంతంగా రుతుమిత్ర కిట్ పరికరం రూపొందించింది. ఈ సందర్భంగా డీఈఓ యాదయ్య, సైన్స్ అధికారి మధుబాబు ఆమెను అభినందించారు.

error: Content is protected !!