News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ఫస్ట్

image

ఇంటర్ ఫలితాల్లో మన మేడ్చల్ జిల్లా సత్తాచాటింది. ఫస్టియర్‌లో 77.21 శాతంతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 68,650 మంది పరీక్ష రాశారు. ఇందులో 53,003 మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లోనూ విద్యార్థుల హవా కొనసాగింది. 62,539 మంది పాస్ పరీక్ష రాయగా.. 48,726 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 77.91 శాతంతో మేడ్చల్ జిల్లా మూడవ స్థానంలో నిలిచింది.

Similar News

News April 23, 2025

ఖమ్మం: సివిల్స్‌లో 231వ ర్యాంకు సాధించిన చరణ్ తేజ

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ దేశవ్యాప్తంగా విడుదలైన సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించారు. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తేజ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు ప్రశంసించారు.

News April 23, 2025

HYD: OUలో వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజుకు అవకాశం

image

OU పరిధిలోని డిగ్రీ కోర్సులకు వన్ టైమ్ ఛాన్స్ పరీక్షా ఫీజులు స్వీకరిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫీజును వచ్చే నెల 19 వరకు చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుంతో 29 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు www.osmania.ac.in ను చూడాలన్నారు.

News April 23, 2025

రాజశేఖర్‌కు మే 6 వరకు రిమాండ్

image

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌కు ఏసీబీ కోర్టు మే 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో మొత్తం 29 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. A1గా రాజశేఖర్‌ను పేర్కొంది. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేసింది.

error: Content is protected !!