News February 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.

Similar News

News February 6, 2025

విజయవాడ: గోల్కొండ, ప్యాసింజర్ రైలు రద్దు 

image

ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోల్కొండ, డోర్నకల్ ప్యాసింజర్ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో 17202, సికింద్రాబాద్ నుంచి గుంటూరు, 17201 గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, 67767 డోర్నకల్ నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్, 67768 విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రద్దు కానున్నాయి. 

News February 6, 2025

బుమ్రా గాయంపై రోహిత్ UPDATE

image

స్టార్ పేసర్ బుమ్రా గాయంపై కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనికి 2 రోజులు స్కాన్స్ జరగాల్సి ఉందన్నారు. అందులో వచ్చిన రిజల్ట్స్‌ను బట్టి ఇంగ్లండ్‌తో మూడో వన్డే, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటంపై క్లారిటీ వస్తుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా NCAలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ENGతో ODI సిరీస్‌కు అతని స్థానంలో వరుణ్‌ను BCCI ఎంపిక చేసింది.

News February 6, 2025

బెజ్జూర్: పంచాయతీ కార్యదర్శులతో MEETING

image

మండల అభివృద్ధి కార్యాలయంలో నేడు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో గౌరీశంకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశానుసారం ఎన్నికల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణంలో ఆయన రావచ్చని అందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు.

error: Content is protected !!