News March 13, 2025
ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: గంగాధర్

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అధికారులను ఆదేశించారు. భువనగిరిలో ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ముద్రించిన పోస్టర్ అవిష్కరించి మాట్లాడారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, నేరుగా సూర్యకిరణాలు తాకే స్థలాల్లో పనిచేసే వారు వడదెబ్బకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News March 13, 2025
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెంటనే ఆయన సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
News March 13, 2025
విజయనగరం- భద్రాచలం ప్రత్యేక బస్సులు

విజయనగరం డిపో నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 5వ తేదీ సాయంత్రం 4:30 కి బయలుదేరి 6వ తేదీ ఉదయం 5 గంటలకు భద్రాచలం చేరుకుని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి 7వ తేదీన ఉదయం 5:30 గంటలకి విజయనగరం చేరుతాయన్నారు.
News March 13, 2025
MBNR: క్రమబద్ధీకరించుకుని రాయితీ పొందండి: కలెక్టర్

అనధికార ప్లాట్లు లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని 31190 మంది దరఖాస్తుదారులు క్రమబద్ధీకరించుకుని 25% రాయితీని పొందుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. ముందుకు వచ్చిన దరఖాస్తుదారుడికి వెంటనే పరిష్కరించేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.