News February 5, 2025

ఏలూరులో ఏసీబీ దాడులు..ఫుడ్ సేఫ్టీ అధికారిని అరెస్టు

image

ఏలూరు నగరంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం..ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్య రెడ్డి బుధవారం రూ.15,000 లంచం తీసుకుంటుండగా రైడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. అధికారితో పాటు ఆఫీసు సబార్డినేట్ పుల్లారావును అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాధికారుల చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరించారు. ఏసీబీ డీఎస్పీ, అధికారులు ఉన్నారు.

Similar News

News February 5, 2025

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు.. ఎస్పీ సూచనలు 

image

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News February 5, 2025

ఢిల్లీలో కమలానికే పీఠం: చాణక్య స్ట్రాటజీస్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJPదే విజయమని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. బీజేపీకి 39-44 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్‌ 25-28 స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వచ్చే ఆస్కారముందని తెలిపింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీ 51-60 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 10-19 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలిపింది.

News February 5, 2025

కడెం: ‘పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి’

image

మండలంలోని ఉడుంపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి చైతన్యపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఎంపీవో కవిరాజుకు బుధవారం ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి సక్రమంగా విధులకు హాజరు కావడంలేదని, ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!