News January 29, 2025
కరప : 5వతరగతి బాలికపై HM లైంగిక వేధింపులు

5 తరవగతి బాలికపై HM లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కరప(M) వాకాడ పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. చిన్నారిని తరచూ వేధింపులకు గురిచేస్తుండగా.. తల్లికి విషయం చెప్పింది. ఈ నెల 3న తల్లి , స్థానికులతో కలిసి పాఠశాలకు వెళ్లి HM రామారావును దూషించి దేహశుద్ధి చేశారు. దీంతో అప్పటినుంచి HM సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అతను జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శిగా ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 14, 2025
గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.
News March 14, 2025
బాచుపల్లి: కాలుష్యంపై రేపు నిరసన

పరిశ్రమల ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రేపు నిరసన తెలియచేయనున్నట్లు 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మీ సుబ్బారావు తెలిపారు. సనత్‌నగర్‌లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులో రేపు ఉదయం 11 గం.లకు అధికారులకు వినతిపత్రం అందచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
News March 14, 2025
రేగొండ: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి(52) డీబీఎం-38 కెనాల్ మోటార్ పైపు కింద చెత్తను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరణ జరిగి రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.