News February 13, 2025
కరీంనగర్ జిల్లాలో MURDER.. ఇద్దరికి జీవిత ఖైదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739465757387_718-normal-WIFI.webp)
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన కేసులో జిల్లా సెషన్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 2020 డిసెంబర్ 10న జరిగిన దాడిలో మెట్టుపల్లికి చెందిన రాచమల్ల సంపత్‌ను అదే గ్రామానికి చెందిన బోనగిరి జంపయ్య, బోనగిరి ఓదెలు దాడి చేసి చంపిన కేసులో వీరు ఇరువురికి రూ.2,500 జరిమానాతో పాటు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
Similar News
News February 14, 2025
ADB: ‘కేంద్రమంత్రి అశ్విన్ కుమార్‌ను కలిసిన ఎంపీ నగేశ్’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739459974188_16876240-normal-WIFI.webp)
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్‌ను ఎంపీ నగేశ్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నుంచి ADB వరకు వయా నిర్మల్ రైల్వేలైన్, నాందేడ్ నుంచి కొన్ని రైళ్లను ADB వరకు పొడిగించాలని కోరారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్(టి) వరకు పొడిగించాలని, కాజీపేట నుంచి హౌరాకు పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్ మీదుగా కొత్త రైలు వేయాలని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు నగేశ్ పేర్కొన్నారు.
News February 14, 2025
WPL-2025కు వేళాయె.. నేడే తొలి మ్యాచ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739484030479_893-normal-WIFI.webp)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2025 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. నేడు తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. వడోదర వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. 5 జట్లు పాల్గొనే ఈ టీ20 లీగ్ 2023లో ప్రారంభమైంది. తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్, రెండో సీజన్‌లో RCB విజేతలుగా నిలిచాయి.
News February 14, 2025
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో కొరియర్ బాయ్‌కి గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739459855818_52001903-normal-WIFI.webp)
మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజు (24) కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. రాత్రి హైదరాబాద్ వైపు నుంచి తూప్రాన్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ రామాయపల్లి బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.