News March 5, 2025
కామారెడ్డి: పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

జిల్లాలో రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం 18469 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 38 సెంటర్లకు గాను 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, 6 సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించినట్లు పేర్కొన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News March 5, 2025
కొత్తగూడెం: రూ.10.30లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మంగళవారం టౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో 2 ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద రూ.10.30 లక్షలు విలువ గల 20 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వీరంతా సుక్మా జిల్లాకు చెందిన వారిగా విచారణలో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు.
News March 5, 2025
నిజామాబాద్: అలీసాగర్ లిఫ్ట్ కాల్వలో శవం లభ్యం

ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల అలీసాగర్ లిఫ్ట్ కాల్వ తూము వద్ద వ్యక్తి శవం లభ్యమవడం కలకలం లేపింది. అలీసాగర్ లిఫ్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
News March 5, 2025
కూటమి మద్దతు అభ్యర్థి ఓటమి వారికి చెంపపెట్టు: UTF

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల్లో వైసీపీ మద్దతిచ్చిన UTF అభ్యర్థి ఓడారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆ సంఘం ఖండించింది. UTFకు రాజకీయాలు అంటగట్టడం సరికాదంది. APTF, PRTU అభ్యర్థులకు కూటమి ముసుగు వేయడం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించింది. కూటమి మద్దతు పలికిన అభ్యర్థి ఓటమి వారు విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టు అని పేర్కొంది.