News February 1, 2025
కేంద్ర మంత్రితో బాపట్ల ఎంపీ భేటీ
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి H.D కుమారస్వామిని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ నిమిత్తం రూ.11,440 కోట్లు కేటాయించినందుకు ఆయనకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు విషయాలను ప్రస్తావించారు.
Similar News
News February 1, 2025
NZB: ఫేక్ యాప్‌తో మోసం.. ఇద్దరి అరెస్ట్
ఫేక్ యాప్‌లో ఆఫర్ల పేరిట అమాయకులను మోసం చేస్తున్న షేక్ అమిర్, సయ్యద్ ఇమ్రాన్ అలీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. MGI యాప్ పేరుతో దాదాపుగా 12 మంది బాధితుల నుంచి రూ.2.40లక్షల నగదును కాజేశారని పేర్కొన్నారు. ఇలాంటి యాప్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన పోలీసు అధికారులను ACP అభినందించారు.
News February 1, 2025
కోటి మందికి ఊరట
కొత్త పన్ను విధానంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.12లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభిస్తుందని తాజాగా మీడియాతో వెల్లడించారు. పన్ను శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. గతంలో రూ.8లక్షల ఆదాయం ఉన్నవారు రూ.30వేలు పన్ను కట్టేవారని గుర్తుచేశారు.
News February 1, 2025
తులం బంగారం ఏదని నిలదీయాలి: KTR
TG: రాష్ట్రంలో 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా అని సవాల్ చేశానని, దానిపై సీఎం రేవంత్ స్పందించలేదని KTR అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతుబంధు పైసలు కూడా బీఆర్ఎస్ కూడబెట్టినవే అని చెప్పారు. ‘రేవంత్ సర్కార్ ఒక్క రూపాయి కూడా రైతుబంధు ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రైతుబంధు డ్రామా. ఎకరాకు రూ.17,500 ఇచ్చేదాకా వదిలిపెట్టొద్దు. తులం బంగారం ఏదని మహిళలు నిలదీయాలి’ అని KTR అన్నారు.