News March 14, 2025

కేంద్ర మంత్రిని కలిసిన ADB MP

image

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. NH44ను భోరజ్ నుంచి మహోర్ వరకు, గుడిహత్నూర్ నుంచి ఆసిఫాబాద్‌కు పొడింగించాలని విన్నవించారు. పెన్ గంగా&గోదావరి రోడ్డు మీద సేఫ్టీ పనులు త్వరలో పూర్తి చేయాలని కోరారు.

Similar News

News March 14, 2025

వర్తు వర్మ.. ‘వారి కర్మ’

image

AP: పిఠాపురంలో పవన్ గెలుపుపై నాగబాబు చేసిన తాజా <<15761376>>వ్యాఖ్యలు<<>> YCPకి అస్త్రంగా మారాయి. వర్మ సపోర్టు వల్లే తాను అక్కడ గెలిచానని చెప్పిన పవన్ ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. తీరం దాటాక తెడ్డు తగలేసినట్లు జనసేనాని వ్యవహారం ఉందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అప్పట్లో వర్తు వర్మ అని ఇప్పుడు ’వారి కర్మ’ అంటున్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

News March 14, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

image

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 20 నుంచి 26 వరకు జరగనున్నాయి. థియరీ పరీక్షలు రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మ. 12 గంటల వరకు, రెండో సెషన్ మ.2.30 గంటల నుంచి సా.5.30 గంటల వరకు జరుగుతుంది. అటు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమై మే 3న ముగుస్తాయి.

News March 14, 2025

ములుగు: హోలీ పండుగ వేళ రంగుల చందమామ 

image

హోలీ పండుగ వేళ శుక్రవారం సాయంత్రం చందమామ బంగారం వర్ణంతో దర్శనమిచ్చాడు. చందమామ చుట్టూ వలయం హోలీ రంగును పోలి ఉండడంతో ప్రజలు చందమామను ఆసక్తిగా తిలకించారు. హోలీ పండుగ వేళ ఆకాశంలో నెలకొన్న ఈ అద్భుత దృశ్యాన్ని ప్రకృతి ప్రేమికులు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. 

error: Content is protected !!