News October 11, 2024

కేసీఆర్ 5వేల స్కూళ్లను మూసేశారు: సీఎం

image

TG: పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ విద్యపై దృష్టి పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతో దాదాపు 5వేల స్కూళ్లను మూసేశారని ఆరోపించారు. పేదలు చదువుకుంటే బానిసలుగా ఉండరనేది కేసీఆర్ ఆలోచన అని మండిపడ్డారు. తాము విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని సీఎం వివరించారు.

Similar News

News December 22, 2024

ఫ్యాన్స్ ముసుగులో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు: బన్నీ వార్నింగ్

image

తన అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగటివ్ పోస్టులు వేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’ అని కోరారు. కాగా, బన్నీ అరెస్టు తర్వాత సీఎంపై అభ్యంతరకరంగా పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి.

News December 22, 2024

భద్రతను కుదించుకున్న చంద్రబాబు

image

AP: CM చంద్రబాబు తన భద్రతను కుదించుకున్నారు. సిబ్బంది స్థానంలో టెక్నాలజీని వినియోగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని CM నివాసంలో సిబ్బందికి బదులు డ్రోన్‌తో పహారా కాయనున్నారు. ఇది కొత్తగా, అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే మానిటరింగ్ టీమ్‌కు సమాచారం చేరవేస్తుంది. దానికి కేటాయించిన డక్‌పై అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. చంద్రబాబుకు ప్రస్తుతం 121 మంది భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.

News December 22, 2024

‘పీలింగ్స్’ సాంగ్‌‌లో నటించేందుకు ఇబ్బంది పడ్డా: రష్మిక మందన్న

image

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్‌‌లో నటించేందుకు తొలుత ఇబ్బంది పడ్డానని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. ‘పుష్ప 2 సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే పీలింగ్స్ సాంగ్ షూటింగ్ ప్రారంభించాం. ఎవరైనా నన్ను ఎత్తుకుంటే నాకు భయం. అల్లు అర్జున్ నన్ను ఎత్తుకుని డాన్స్ చేశారు. ముందు కొంచెం భయంగా, అసౌకర్యంగా అనిపించింది. కానీ డైరెక్టర్ చెప్పినట్లు చేసేశా’ అని ఆమె చెప్పుకొచ్చారు.