News February 4, 2025
గంజాయి కేసులో 3 నెలల జైలుశిక్ష: సీఐ
గంజాయి అక్రమ తరలింపు కేసులో ఓ వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ JFCM కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి సోమవారం తీర్పు ఇచ్చారు. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో ASFమండలం గోండుగూడకి చెందిన మాడావి దేవ్రావు కిలో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. సాక్ష్యాధారాలు పరిశీలించి, నేరం రుజువు కావడంతో నిందితుడికి 3 నెలల జైలుశిక్ష రూ.5 వేల జరిమానా విధించారు.
Similar News
News February 4, 2025
ఎమ్మెల్సీ కిడ్నాప్ కాలేదు: తిరుపతి ఎస్పీ
తిరుపతి ఎమ్మెల్సీ కిడ్నాప్ అయ్యారని జరుగుతున్న ప్రచారంపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. ‘ఎమ్మెల్సీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనే వీడియో విడుదల చేశారు. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌తో పాటు బందోబస్త్ పెంచాం. బాలాజీ కాలనీ నుంచి ఎస్వీయూ వరకు వాహనాలు మళ్లించాం’ అని ఎస్పీ స్పష్టం చేశారు.
News February 4, 2025
ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బలరాం
బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా సిరికొండ బలరాంను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ కౌన్సిల్ సభ్యులుగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు భూక్యా జవహర్ లాల్‌ను నియమించింది. ఎస్టీ నియోజకవర్గమైన ములుగుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన బలరామును అధ్యక్షుడిగా నియమించడం విశేషం.
News February 4, 2025
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.