News April 6, 2025
గద్వాల: ఉరేసుకుని యువకుడి మృతి

గద్వాల మండలంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. చెనుగోనిపల్లికి చెందిన దౌలత్, ఫరిదాబీల కొడుకు ఖాజా ఇంటర్ వరకు చదివాడు. HYDలో ఉద్యోగం చేసేవాడు. రంజాన్‌కు ఇంటికొచ్చి తిరిగెళ్లకపోవటంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన ఖాజా ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News April 9, 2025
ఇంటి నుంచే పనిచేస్తున్న ఢిల్లీ సీఎం రేఖ

ఢిల్లీ CMగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తయినా అధికారిక నివాసంపై నిర్ణయం తీసుకోలేదు. మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించిన బంగ్లాలోకి వెళ్లడానికి ఆమె ఇష్టపడలేదు. షాలిమార్ బాగ్‌లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో VIPలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 25KM ప్రయాణించి ఆమె సచివాలయానికి వెళ్తున్నారు. సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్‌లో నివాసం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
News April 9, 2025
USAIDపై స్పందించిన వైట్‌హౌస్

వృథా ఖర్చులు తగ్గించుకోవడం కోసమంటూ నిలిపివేసిన USAID పునరుద్ధరణకు USA చర్యలు తీసుకుంటోంది. ఎక్కడో పొరపాటు జరిగిందని, నిధులు పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఫండ్స్ నిలిపివేయడంతో అంతర్యుద్ధాలతో అల్లాడే 14 దేశాలకు ఆహార సహాయం నిలిచిపోయింది. ఈ దేశాల్లో ఆకలి చావులు సంభవిస్తాయంటూ ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ప్రపంచ ఆహార కార్యక్రమ(WFP) చెల్లింపులకు USA ముందుకొచ్చింది.
News April 9, 2025
జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి: సీతక్క

సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన సామాజిక అభివృద్ధి సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న పలు మహిళా శిశు సంక్షేమ, సామాజిక కార్యక్రమాలను సదస్సులో సీతక్క వివరించారు.