News April 4, 2025
జగిత్యాల: జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం రాయికల్, నేరెళ్లలో 37.9℃. అల్లీపూర్, గోదూరు 37.8, ధర్మపురి 37.7, సిరికొండ 37.6, జైన, వెల్గటూర్ 37.5, కథలాపూర్, గొల్లపల్లె 37.3, కోరుట్ల, మెట్పల్లె 37.1, పెగడపల్లె 36.9, మారేడుపల్లి 36.6, ఐలాపూర్, మల్లాపూర్ 36.5, మేడిపల్లిలో 36.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా మబ్బులు కమ్ముకోవడంతో మధ్యాహ్నం నుంచి జిల్లాలో ఎండ తీవ్రత చాలా తగ్గిపోయింది.
Similar News
News April 8, 2025
TODAY HEADLINES

* ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రులు: సీఎం చంద్రబాబు
* గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంపు
* గిరిజన యువత గంజాయి సాగు వదిలేయాలి: పవన్ కళ్యాణ్
* HCU విద్యార్థులపై కేసులు ఎత్తేయండి: భట్టి
* భూకబ్జా కేసులో వల్లభనేని వంశీకి బెయిల్
* భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
* రామ్ చరణ్ ‘పెద్ది’ సెన్సేషన్ రికార్డు
* రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి
News April 8, 2025
సమ్మర్‌లో మీ ఫోన్ వేడెక్కుతోందా?

సమ్మర్‌లో ఎలక్ట్రానిక్ పరికరాలు వేగంగా వేడెక్కుతుంటాయి. వాటిలో మనం నిత్యం ఉపయోగించే మొబైల్ ఫోన్‌పై వేడిమి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫోన్‌పై సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవాలి. యాప్స్‌ను ఎక్కువగా వాడకుండా ఉండాలి. వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసేయాలి. వేడెక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీజర్‌లో ఉంచకూడదు. కారులో ఫోన్ పెట్టి వదిలేయకండి
News April 8, 2025
IPL: పోరాడి ఓడిన ముంబై

వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో ముంబై పోరాడి ఓడింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ(29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్య(15 బంతుల్లో 42) వీరోచిత పోరాటం వృథా అయింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4 వికెట్లు, దయాల్, హేజిల్‌వుడ్ చెరో 2, భువీ ఒక వికెట్ తీశారు.