News February 6, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!
@జగిత్యాల మాత శిశు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ @కలెక్టరేట్ లో పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం @వెల్గటూరులో విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం @ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం @జగిత్యాలలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆకస్మి తనిఖీలు @కోరుట్లలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం @కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు
Similar News
News February 7, 2025
సోనూసూద్ అరెస్ట్‌కు వారెంట్
నటుడు సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు.
News February 7, 2025
NGKL: చెరువులో పడి మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీరంగాపురం చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 ఏళ్ల వయసున్న మహిళ చెరువులో మునిగి చనిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
News February 7, 2025
నేడు క్యాబినెట్‌లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ, ఆమోదం!
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు రూపకల్పన పూర్తయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనిపై ఇవాళ క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారని పేర్కొన్నాయి. వారంలో లోక్‌సభలో ప్రవేశపెడతారని చెప్పాయి. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కొత్త బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందరికీ అర్థమయ్యేలా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని వెల్లడించారు.