News April 4, 2025

జనగామ మార్కెట్ యార్డ్ 3 రోజులు బంద్

image

జనగామలోని మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ శివరాజ్ యాదవ్ తెలిపారు. భారీ మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు వచ్చిన కారణంగా యార్డ్‌లో స్థలం లేదన్నారు. దీంతో శుక్రవారం సెలవు ప్రకటించారు. శనివారం జగ్జీవన్ జయంతి, ఆదివారంతో కలిపి మొత్తం 3 రోజులు మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. సోమవారం తిరిగి పున:ప్రారంభం ప్రారంభమవుతుందని, రైతులు సహకరించాలని కోరారు.

Similar News

News April 11, 2025

ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. సబ్జెక్ట్ వారీగా టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరాయి. 

News April 11, 2025

బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ అవార్డు 3వసారి మనకే..!

image

GMR శంషాబాద్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్‌ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా విభాగంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ 2025 అవార్డును నాలుగోసారి కంపెనీ CEO ప్రదీప్‌ ఫణికర్‌ అందుకున్నారు. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.

News April 11, 2025

రాణాపై మోదీ ట్వీట్.. 14ఏళ్ల తర్వాత వైరల్

image

ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాపై ప్రస్తుత ప్రధాని మోదీ 2011, జూన్ 10న చేసిన ట్వీట్ తాజాగా వైరలవుతోంది. ‘ముంబై దాడిలో తహవూర్ రాణా నిర్దోషి అని అమెరికా ప్రకటించి భారత సార్వభౌమత్వాన్ని అవమానించింది. ఇది విదేశాంగ విధానానికి తిరోగమనం’ అని ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చారు. ఇప్పుడు 14ఏళ్ల తర్వాత రాణాను అమెరికా నుంచి రప్పించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!