News April 5, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దు

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దయింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం రేపు ఉదయం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కళ్యాణంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నేడు భద్రాద్రికి రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయినట్లు ఓ ప్రకటన జారీ అయ్యింది.

Similar News

News April 11, 2025

తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్ నాగేంద్రన్?

image

తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్‌గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగేంద్రన్‌ పేరును ప్రతిపాదించగా, ఇతర నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం.

News April 11, 2025

రేపే రిజల్ట్.. నంద్యాల జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. నంద్యాల జిల్లాలో ఫస్టియర్ 15,692 మంది, సెకండియర్ 13,400 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

త్వరలో బీసీ సంరక్షణ చట్టం: చంద్రబాబు

image

AP: టీడీపీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. మరోవైపు అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

error: Content is protected !!