News April 1, 2025
డ్రంక్ అండ్ డ్రై తనిఖీలతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యం: వరంగల్ సీపీ

డ్రంక్ అండ్ డ్రై తనిఖీల ద్వారా రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ట్రాఫిక్ అధికారులకు సూచించారు. మంగళవారం హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ నియంత్రణతో పాటు.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ సీతా రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 3, 2025
లోకేశ్ సభలో బారికేడ్లు, పరదాలు.. వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు

AP: మంత్రి లోకేశ్ సభలో గ్రీన్‌మ్యాట్లు, బారికేడ్లు, పరదాలు ఉండటంపై YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ‘గ్రీన్ మ్యాట్లు వేస్తే గ్రాఫిక్స్ కోసం, పరదాలు కడితే అప్రజాస్వామ్యం, బారికేడ్లు పెడితే ప్రజలకు భయపడి, ఫొటోగ్రాఫర్స్ ఉంటే ప్రచార పిచ్చి.. ఇవి వైఎస్ జగన్ CMగా ఉన్నప్పుడు లోకేశ్ వాడిన పదజాలం. నేడు ఆయన కార్యక్రమానికి అవే పదాలు వర్తించవా?’ అని ప్రశ్నిస్తూ ఓ ఫొటోను షేర్ చేశారు.
News April 3, 2025
బాధితులకు అండగా భరోసా: MHBD ఎస్పీ

మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు భరోసా సెంటర్ నిలుస్తోందని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ అన్నారు. భరోసా సెంటర్ నుంచి 8 మంది బాధితులకు అందాల్సిన రూ.65 వేల చెక్కులు, ఒకరికి కుట్టు మిషన్‌ను ఆయన గురువారం అందజేశారు. ఆయనతో పాటు డీఎస్పీ తిరుపతిరావు, ఎస్ఐ దీపికా రెడ్డి, భరోసా ఎస్ఐ ఝాన్సీ, తదితరులు ఉన్నారు.
News April 3, 2025
రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్: పార్థసారథి

AP: అనకాపల్లి జిల్లాలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో మెస్సర్స్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో నిర్మాణం జరుగుతుందన్నారు. మొదటిదశలో రూ.55,964 కోట్ల పెట్టుబడి, రెండో దశలో రూ.80వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు జరుగుతాయన్నారు. వీటి ద్వారా 55 వేల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు.