News February 26, 2025
తాళ్లపూడి: గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

ఉమ్మడి తూ.గో.జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా గోదావరిలోకి స్నానానికి దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2025
ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: MHBD ఎస్పీ

ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 150 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ఎస్పీ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో 1663 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.
News February 26, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: భారీ స్కోర్ చేసిన అఫ్గాన్

ఇంగ్లండ్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 325/7 స్కోర్ చేసింది. ఇబ్రహీం జద్రాన్ (177) భారీ ఇన్నింగ్స్‌తో ENG బౌలర్లకు చెమటలు పట్టించారు. నబీ(40), హస్మతుల్లా (40), అజ్మతుల్లా (41) రన్స్‌తో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్‌స్టోన్ 2 వికెట్లు, ఓవర్టన్, రషీద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ENG 50 ఓవర్లలో 326 రన్స్ చేయాలి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
News February 26, 2025
నార్త్ కొరియాలోకి విదేశీ పర్యాటకులకు అనుమతి?

ఐదేళ్ల తర్వాత నార్త్ కొరియా తమ దేశంలోకి విదేశీ పర్యాటకులను ఆహ్వానిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. పర్యాటకం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ మారక నిల్వలపై దృష్టి పెడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్-19 సంక్షోభం సమయంలో ఆ దేశం విదేశీ పర్యాటకులపై నిషేధం విధించింది. ఇప్పుడు మళ్లీ పర్యాటకులను ఆహ్వానిస్తోంది.