News February 13, 2025
తూంకుంటలో హైడ్రా కూల్చివేతలు

తూంకుంట మున్సిపల్ పరిధిలోని కోమటికుంటలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చివేశారు. కోమటికుంటలోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో హైడ్రా అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ నిర్మించినట్లు గుర్తించి నేలమట్టం చేశారు.
Similar News
News March 12, 2025
ODI ర్యాంకింగ్స్: టాప్-3లో గిల్, రోహిత్

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్-5లో నిలిచారు. గిల్ తొలి స్థానంలో ఉండగా, రోహిత్ 3, కోహ్లీ 5, శ్రేయస్ పదో ర్యాంకు సాధించారు. బౌలింగ్‌లో కుల్దీప్ 3, జడేజా పదో స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్లలో జడేజా పదో స్థానంలో నిలిచారు. ODI, టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానాన్ని దక్కించుకుంది.
News March 12, 2025
హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన కర్నూలు జైల్లో ఉండగా గుంటూరు సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేశారు. హైకోర్టు తాజాగా పిటిషన్ కొట్టేయడంతో పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 12, 2025
జగన్‌పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

AP: మాజీ CM YS జగన్‌పై YCP మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకెళ్తారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు చాలాసార్లు చెప్పినా ఫలితం లేదు. చెప్పుడు మాటలను నాయకుడు వినకూడదు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టి YCP నుంచి బయటకు వచ్చా. నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు. తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.