News February 24, 2025

దుద్యాల: నేటితో ముగియనున్న ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు

image

దుద్యాల మండలం పోలేపల్లిలో వెలసిన భక్తుల ఇలవేల్పు రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఆదివారం ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ కమిటీ వారు సోమవారం రాత్రి అమ్మవారి ఆలయాన్ని ఊరేగింపు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు పునఃప్రారంభమైనప్పటి నుంచి పోలేపల్లి ఎల్లమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.

Similar News

News February 24, 2025

‘ఛావా’ సంచలనం

image

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఛావా’ కలెక్షన్లలో దూసుకుపోతోంది. రెండో వీకెండ్‌లోనూ బాలీవుడ్‌లో రూ.100 కోట్లపైన వసూలు చేసిన రెండో చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ‘పుష్ప-2’ రూ.128 కోట్లు వసూలు చేయగా, ‘ఛావా’ రూ.109 కోట్లు రాబట్టినట్లు వెల్లడించాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.

News February 24, 2025

కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్‌కు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా అధికారులు సోమవారం తెలిపారు. కోనసీమలోని 22 మండలాల్లో 64,471 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో పురుషులు 37,114 మంది, మహిళా ఓటర్లు 27,355 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారన్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుందన్నారు.

News February 24, 2025

ఏపీ అసెంబ్లీ వాయిదా

image

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, సీఎం చంద్రబాబు ఆయనను బయట వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. కాసేపటికే సభను రేపటికి వాయిదా వేశారు. కాగా ఇవాళ సభకు హాజరైన వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశారు.

error: Content is protected !!