News March 13, 2025

దోమ: ఘోర రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్‌కు తరలింపు

image

దోమ మండలం మైలారం గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొడుగోనిపల్లి నుంచి మోత్కూర్ వెళ్లే రోడ్డులో కోళ్ల ఫారం దగ్గర మోత్కూర్ గ్రామానికి చెందిన సండి సాయికుమార్, ధన్ రాజ్ అనే వ్యక్తులు బైక్‌తో ట్రాక్టర్‌కు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పరిగి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించగా.. అక్కడి నుంచి వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Similar News

News March 13, 2025

VZM: డీసీహెచ్ఎస్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పరిధిలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని డీసీహెచ్ఎస్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులను జిల్లా సర్వజన ఆసుపత్రిలోని కార్యాలయానికి అందజేయాలన్నారు. పూర్తి వివరాలు https://www.ap.gov.in వెబ్‌సైట్‌‌లో కలవు.

News March 13, 2025

ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

image

తెలంగాణలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో ఒంటి గంట నుంచి సా.5 వరకు తరగతులు నిర్వహిస్తారు. అటు ఏపీలోనూ ఎల్లుండి నుంచి ఒంటిపూట స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 13, 2025

మహిళలతో తప్పుడు ప్రవర్తన.. చెంప చెళ్లుమనిపించా: హీరో

image

మహిళలతో తప్పుగా ప్రవర్తించిన ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించానని హిందీ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘2008లో సంతోష్ అనే అభిమాని నా కోసం సెట్స్‌కు వచ్చాడు. అతడు మహిళలతో తప్పుగా ప్రవర్తించడం చూసి చెంప మీద కొట్టాను. దీంతో అతడు నాపై కేసు పెట్టాడు. 9ఏళ్లపాటు ఆ కేసు సాగింది. ఎట్టకేలకు అతడిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలు సంపాదించి కేసు గెలిచాను’ అని తెలిపారు.

error: Content is protected !!