News March 17, 2025
నంద్యాల కలెక్టరేట్‌కు 209 అర్జీల రాక

నంద్యాల కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే జరిగింది. జిల్లా నలుమూలాల నుంచి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను అధికారులకు వివరించారు. మొత్తంగా 209 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పరిష్కరించిన 27,854 ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు.
Similar News
News March 18, 2025
సవిత షటిల్.. పరిటాల సునీత క్యారమ్స్

విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నేటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరగనున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌లో మంత్రి సవిత పాల్గొంటారు. క్యారమ్స్‌లో ఆడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత తన పేరును నమోదు చేసుకున్నారు. ఇక 100మీ పరుగు పందెంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పోటీ పడనున్నారు. విజేతలకు సీఎం బహుమతులు అందజేస్తారు.
News March 18, 2025
ఏలూరు: మహిళపై అత్యాచారం

తనకు న్యాయం చేయాలని అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబీకులు సోమవారం ఏలూరు ఐజీ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఉండికి చెందిన తనపై రవి, సోమేశ్వరరావు పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.2.30 లక్షలు తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే భర్త, మరిదిపై కౌంటర్ కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయింది.
News March 18, 2025
నల్గొండ: పేదలకు అందని రేషన్ బియ్యం!

నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల పేదలకు ఇంకా రేషన్ బియ్యం అందలేదు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తారు. గడువు దాటినా బియ్యం అందకపోవడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కాగా జిల్లాలలో 4,66,061 రేషన్ కార్డులుండగా, 994 దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. త్వరగా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.