News March 6, 2025
నిర్మల్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2025
‘సూపర్ 6’కు కేటాయింపులు ఏవి?: అంబటి

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలకూ నిధులు లేవా? అని ఎద్దేవా చేశారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పలేదని విమర్శించారు. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పిన నేతలు కేటాయింపులు ఎందుకు చేయలేదని నిలదీశారు. CMగా ఉన్న వ్యక్తి పక్కపార్టీ వారికి సాయం చేయొద్దని చెబుతారా? అని ప్రశ్నించారు.
News March 6, 2025
వచ్చే సంక్రాంతి మామూలుగా ఉండదుగా!

సంక్రాంతి వచ్చిందంటే చాలు టాలీవుడ్‌లో సినిమాల పండుగ మొదలవుతుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుంచే పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆ టైమ్‌కి NTR-NEEL, చిరంజీవి- అనిల్ రావిపూడి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’, రవితేజ- కిశోర్, వెంకటేశ్ -సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చే సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సారి మొత్తం మూడు సినిమాలు రిలీజవగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అధిక వసూళ్లు రాబట్టింది.
News March 6, 2025
నిర్మల్: 2nd ఇయర్ పరీక్షకు 296 గైర్హాజరు

గురువారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 2nd ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఇంటర్మిడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ పరశురాం తెలిపారు. 6,102 మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 5,172, ఒకేషనల్ విభాగంలో 634 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా, 296 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.