News January 30, 2025
నేడు ఎంజీఎంలో గుండె వైద్య శిబిరం

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా పిల్లలకు గుండె పరీక్షల వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు చిన్నారులకు ఉచితంగా 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు కోరారు.
Similar News
News March 14, 2025
పబ్లిక్ ఇష్యూకు LG ఇండియా: Rs15000CR

రూ.15000 కోట్ల విలువతో IPOకు వచ్చేందుకు సెబీ వద్ద LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అనుమతి తీసుకుంది. ఇదే జరిగితే హ్యుందాయ్ తర్వాత NSE, BSEల్లో నమోదైన సౌత్ కొరియా రెండో కంపెనీగా అవతరిస్తుంది. 15%కి సమానమైన 10.18 కోట్ల షేర్లను OFS పద్ధతిన కేటాయించనుంది. అంటే ఈ పెట్టుబడి నేరుగా LG ఇండియాకు కాకుండా ప్రధాన కంపెనీకి వెళ్తుంది. 2024, MAR 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.64,087 కోట్ల ఆదాయం ఆర్జించింది.
News March 14, 2025
వికారాబాద్: యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలి: జడ్జి

యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని జిల్లా సేవాధికార సంస్థ సెక్రటరీ జడ్జి శీతాల్ తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి శీతాల్ మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన కల్పించుకుని బాల్యవివాహాల నిర్మూలనకు యువత కృషి చేయాలన్నారు.
News March 14, 2025
ఆపదలో ఉంటే 100కు ఫోన్ చేయండి: SP

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు
ప్రశంసాపత్రాలు అందించారు.