News February 7, 2025

నేడు వైసీపీలోకి శైలజానాథ్

image

మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ నేడు వైసీపీలో చేరనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన శింగనమల నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. కష్టసమయంలో వైసీపీ గూటికి చేరుతున్న ఆయనకు జగన్ ఎలాంటి బాధ్యత అప్పగిస్తారన్న విషయమై జిల్లాలో ఆసక్తి నెలకొంది.

Similar News

News February 7, 2025

ట్రాన్స్ జెండర్‌ను లవ్ చేసిన యువకుడు.. అనుమానాస్పద మృతి

image

2 రోజుల క్రితం పురుగు మందు తాగిన తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణం చింతలపేటకు చెందిన నవీన్(25) కర్నూలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఓ ట్రాన్స్‌జెండర్‌ను నవీన్ ప్రేమించాడని, ఆ కమ్యూనిటీ వారే యువకుడిని గాయపరచడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇవాళ గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 7, 2025

విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ

image

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగిన స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ జంబోరి వేడుకలలో పాల్గొని ప్రతిభ చూపిన జిల్లా స్కౌట్ విద్యార్థులను అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు. మున్ముందు మరింత ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

News February 7, 2025

కోహ్లీ ఆడితే జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు?

image

మోకాలి గాయంతో ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడతారని సపోర్ట్ స్టాఫ్ తెలిపింది. అయితే ఆయన తుది జట్టులోకి వస్తే తొలి వన్డే ఆడిన ప్లేయర్లలో ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ స్థానంలో ఆడిన శ్రేయస్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న నేపథ్యంలో అతడిని పక్కనపెట్టే అవకాశం కనిపించడం లేదు. జైస్వాల్‌ను తప్పించి గిల్‌‌ను ఓపెనింగ్, కోహ్లీని వన్ డౌన్‌లో ఆడించే ఛాన్సుంది.

error: Content is protected !!