News March 5, 2025
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. అల్లూరి జేసీ ఆరా..!

తురకలవలస బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై జేసీ, ఇన్ ఛార్జ్ ఐటీడీఏ పీవో డాక్టర్ ఎం.జే అభిషేక్ గౌడ ఆరా తీశారు. ఆశ్రమ పాఠశాలను మంగళవారం సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టాక్ రూమ్, వంట గదిని పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం మంచి ఆహారం అందించాలని ఆదేశించారు.
Similar News
News March 6, 2025
ఆదిలాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకూ అవకాశముందన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.
News March 6, 2025
కృష్ణా జిల్లాలో 39.9 డిగ్రీల ఎండ

కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎండ మండిపోయింది. ముఖ్యంగా కంకిపాడులో 39.9 నమోదు కాగా.. బాపులపాడు, గన్నవరం, పెనమలూరులలో 39 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉన్నదాని కంటే నాలుగు శాతం ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News March 6, 2025
జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

కశ్మీర్‌లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్, గాందర్‌బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.