News February 5, 2025

పాడేరు: లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు ప్రతిపాదనలు

image

లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణకు, నీడ తోటల పెంపకానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను మంగళవారం ఆదేశించారు. రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం 20వేల ఎకరాల్లో కాఫీని విస్తరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనులు పూర్తి చేయకుండా కథలు చెప్పొద్దని, ఉపాధి హామీ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News February 5, 2025

ప్రకాశం: వరల్డ్ కప్‌‌ విజేతకు ఘన స్వాగతం

image

ఢిల్లీలో  జరిగిన ఖోఖో వరల్డ్ కప్‌‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జట్టు గెలుపులో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి  కీలక పాత్ర పోషించాడు. శివారెడ్డి మంగళవారం తన స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో అతనికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ ఊరి కుర్రాడు దేశాన్ని వరల్డ్ ఛాంపియన్‌గా నిలపడం గర్వకారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు

News February 5, 2025

మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు

image

TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.

News February 5, 2025

ఉమ్మితే భారీ జరిమానా.. బెంగాల్ యోచన

image

పొగాకు, పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన సమస్యల్లో ఒకటి. దీన్ని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. బహిరంగప్రాంతాల్లో ఉమ్మేవారిపై అత్యంత భారీగా జరిమానాలు విధించేలా ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ భారీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!