News March 4, 2025
పిఠాపురం: 14న జనసేనలోకి పెండెం దొరబాబు?

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కుటుంబ సమేతంగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు పవన్ సముఖంగా ఉన్నారన్న నేపథ్యంలో ఆయన జనసేనలో ఎప్పుడు చేరుతారనేది పిఠాపురంలో హాట్ టాపిక్‌గా మారింది. దొరబాబు అనుచరులతో పెద్ద ఎత్తున పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో పార్టీ చేరుతారని సమాచారం. దీనిపై అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Similar News
News March 4, 2025
అనకాపల్లి: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 540 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను 540 మంది విద్యార్థులు రాయలేదని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగంలో మొత్తం 14,249 మంది విద్యార్థులకు గాను 13,709 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని కలెక్టర్ తెలిపారు.
News March 4, 2025
నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్

సెమీఫైనల్-1లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన బంతిని ఇంగ్లిస్ కవర్స్ మీదుగా ఆడబోయి కోహ్లీకి ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. అంతకుముందు లబుషేన్(29) జడేజా వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయారు. మరోవైపు స్మిత్(59) వేగంగా పరుగులు చేస్తున్నారు. 28 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 146-4.
News March 4, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 413 మంది గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లాలో 12,162 మంది విద్యార్థులకు గానూ 11,749 విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఒకేషనల్ పరీక్షకు సంబంధించి 1,696 మంది విద్యార్థులకు గానూ 1,595 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.