News March 4, 2025
పెంచికల్పేట్: వివాహిత హత్య.. భర్తపై అనుమానం!

పెంచికల్పేట మండలం లోడ్పల్లి గ్రామానికి చెందిన <<15640043>>లలిత<<>>(35) సోమవారం హత్యకు గురైంది. ఘటనపై కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంలో విచారణ చేపట్టినట్లు CI శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా తన అల్లుడు గణేశ్ కొన్ని రోజులుగా తన కూతురిని వేధిస్తున్నాడని, అతడే లలితను హత్య చేశాడని మృతురాలి తల్లి తాను బాయి ఫిర్యాదు చేసిందన్నారు.
Similar News
News March 4, 2025
ప్రియుడితో హీరోయిన్ తమన్నా బ్రేకప్?

లవ్ బర్డ్స్ తమన్నా, విజయ్ వర్మ తమ డేటింగ్‌కు బ్రేకప్ చెప్పినట్లు ‘పింక్ విల్లా’ కథనం ప్రచురించింది. కొన్ని వారాల క్రితమే విడిపోయిన వీరిద్దరూ స్నేహితులుగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపింది. 2023లో లస్ట్ స్టోరీస్-2 సందర్భంగా తమన్నా, విజయ్ మధ్య రిలేషన్‌షిప్ బయటి ప్రపంచానికి తెలిసింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న వేళ బ్రేకప్ వార్తలు రావడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.
News March 4, 2025
మోతె: ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను పరిశీలించిన కలెక్టర్

మోతె మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు.
News March 4, 2025
అనకాపల్లి: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 540 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను 540 మంది విద్యార్థులు రాయలేదని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగంలో మొత్తం 14,249 మంది విద్యార్థులకు గాను 13,709 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని కలెక్టర్ తెలిపారు.