News April 7, 2025

ప్రజావాణిలో 106 దరఖాస్తులు: కలెక్టర్ ప్రావీణ్య

image

వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన వినతులను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 106 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు స్పందించి తక్షణమే  చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News April 8, 2025

వనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి: కలెక్టర్

image

వరికోతలు ప్రారంభమైన అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో తేమ, తూకం యంత్రాలు, టర్పాలిన్‌లు, గన్ని బ్యాగులు, ధాన్యం శుభ్రం చేసే మిషన్లు లేదా ఫ్యాన్‌లు కచ్చితంగా ఉండాలన్నారు.

News April 8, 2025

మెదక్: నేటి నుంచి పదోతరగతి మూల్యాంకనం

image

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో నేటి నుంచి నిర్వహించే టెన్త్ క్లాస్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన  మాట్లాడుతూ.. 1,222 మంది ఉపాధ్యాయులు  మూల్యాంకనంలో పాల్గొంటారన్నారు. టెన్త్ మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News April 8, 2025

బాంబే హైకోర్టును ఆశ్రయించిన కమ్రా

image

తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయాలని కోరుతూ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ‘శివసేన శిండే వర్గం నాపై పెట్టిన కేసులన్నీ నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేవే. స్వేచ్ఛగా భావాన్ని వ్యక్తీకరించే హక్కు రాజ్యాంగం నాకు కల్పించింది. దయచేసి ఆ కేసుల్ని కొట్టేయండి’ అని అందులో కోరారు. కమ్రా పిటిషన్‌ను కోర్టు నేడు విచారించనుంది.

error: Content is protected !!