News April 24, 2025

భగ్గుమంటున్న పాలమూరు.. జరభద్రం !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. తొలిసారి ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వనపర్తి, గద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, నారాయణంపేటలో 42.4, నాగర్ కర్నూల్ 42.1, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు నమోదైంది. ముందు ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

Similar News

News April 24, 2025

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం: కలెక్టర్

image

భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టంలో ప్రవేశపెట్టిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం బీర్కూరు మండల కేంద్రంలో భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి ధరణిలోని సమస్యలను పరిష్కరించి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ సదస్సులో రెవెన్యూ అధికారులతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

News April 24, 2025

వరంగల్‌లో లొంగిపోయిన 14మంది మావోయిస్టులు

image

TG: వరంగల్‌లో 14మంది మావోయిస్టులు లొంగిపోయారని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ‘మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నాం. అది మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ ఏడాది 250మంది లొంగిపోయారు. వారికి రూ.25 వేలు అందిస్తున్నాం. ఏ రాష్ట్రానికి చెందిన వారు లొంగిపోయినా మా సహకారం అందిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.

News April 24, 2025

పహల్‌గామ్ దాడి.. ఉగ్రవాదులపై రివార్డు ప్రకటన

image

పహల్‌గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులపై జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. అదిల్ హుస్సేన్, అలీ భాయ్ (తల్హా భాయ్), హషీమ్ ముసా (సులేమాన్) ఊహాచిత్రాలతో పోస్టర్లు రిలీజ్ చేశారు. వారి ఆచూకీ గురించి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.20లక్షల రివార్డు ఇస్తామని వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

error: Content is protected !!