News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Similar News
News April 9, 2025
తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం

తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ (104km) డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.1,322కోట్లతో చేపట్టే ఈ పనుల ద్వారా 400 గ్రామాల్లోని 14 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 35 లక్షల పని దినాల కల్పన, పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏడాదికి 4M టన్నుల సరకు రవాణాకు కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
News April 9, 2025
గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. రాయచోటి కలెక్టరేట్‌లో డిఈలు, ఏఈలు, మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. పేదలందరికీ సొంతింటి కల సాకారం చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు అదనపు ఆర్థిక సహాయం కూడా అందిస్తోందన్నారు.
News April 9, 2025
RRతో మ్యాచ్.. గుజరాత్ బ్యాటింగ్

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో GTతో మ్యాచులో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్: జైస్వాల్, సంజూ శాంసన్ (C), నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ధ్రువ్ జురెల్, ఆర్చర్, తీక్షణ, ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే
గుజరాత్: సాయి సుదర్శన్, గిల్ (C), బట్లర్, రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ