News February 26, 2025
భువనగిరి: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ <<15576453>>బలవన్మరణానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.
Similar News
News February 26, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

మెదక్-కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టబద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఎలక్షన్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌లా వారీగా సెక్టార్, ఫ్రీసెండింగ్, అదనపు ఫ్రీసెండింగ్ అధికారులకు అందజేసిన మెటీరియల్ పరిశీలించారు.
News February 26, 2025
ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: MHBD ఎస్పీ

ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 150 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ఎస్పీ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో 1663 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.
News February 26, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: భారీ స్కోర్ చేసిన అఫ్గాన్

ఇంగ్లండ్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 325/7 స్కోర్ చేసింది. ఇబ్రహీం జద్రాన్ (177) భారీ ఇన్నింగ్స్‌తో ENG బౌలర్లకు చెమటలు పట్టించారు. నబీ(40), హస్మతుల్లా (40), అజ్మతుల్లా (41) రన్స్‌తో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్‌స్టోన్ 2 వికెట్లు, ఓవర్టన్, రషీద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ENG 50 ఓవర్లలో 326 రన్స్ చేయాలి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.