News March 9, 2025

మంచిర్యాల జిల్లాలో శనివారం 6,200 కేసులు పరిష్కారం

image

మంచిర్యాల జిల్లా న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గంగా లోక్ అదాలత్ ద్వారా కోర్టు కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా లోక్ అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 6,200 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.1.20 లక్షలు, బ్యాంకు కేసుల్లో రూ.28 లక్షలు రికవరీ అయ్యాయని వివరించారు.

Similar News

News March 10, 2025

రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్: షామా మహ్మద్

image

కెప్టెన్ రోహిత్ శర్మపై <<15636348>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ CT విజేత భారత జట్టుకు అభినందనలు తెలిపారు. 76 పరుగులతో జట్టును ముందుండి నడిపిన హిట్ మ్యాన్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. శ్రేయస్, రాహుల్ కీలక ఇన్నింగ్సుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారని కొనియాడారు.

News March 10, 2025

KNR: ఈ సోమవారం ప్రజావాణి యథాతథం: కలెక్టర్

image

ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.

News March 10, 2025

మార్చి 10: చరిత్రలో ఈ రోజు

image

*1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు
*1896: రంగస్థల నటుడు నిడుముక్కల సుబ్బారావు జననం
*1897: సావిత్రిబాయి ఫూలే మరణం
*1982: ప్రముఖ వైద్యుడు జి.ఎస్.మేల్కోటే మరణం
*1990: సినీ నటి రీతూ వర్మ జననం
*అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం

error: Content is protected !!