News March 17, 2025

రాయచోటి: మండలికి అధ్యక్షత వహించిన మైనార్టీ మహిళ

image

తొలిసారి డిప్యూటీ ఛైర్ పర్సన్ హోదాలో మైనార్టీ మహిళ జకియా ఖానం శాసనమండలికి అధ్యక్షత వహించారు. కాగా ఈమె అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన వారు కావడం గమనార్హం. అధిపతి లేనప్పుడు ఈ అవకాశం దక్కుతుంది. మైనార్టీ మహిళ YCP తరపున ఎమ్మెల్సీగా ఎంపికవ్వడం, డిప్యూటీ ఛైర్ పర్సన్ హోదాలో కూర్చోవడం మరో అరుదైన అవకాశం.

Similar News

News March 18, 2025

దిల్‌సుఖ్‌నగర్‌లో యువతులతో వ్యభిచారం.. ARREST

image

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను ఆకర్షించి, విటుల వద్దకు పంపుతున్న నాగమణి అనే మహిళను హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను దిల్‌సుఖ్‌‌నగర్‌లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.

News March 18, 2025

తెలంగాణ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నోటీసులు

image

అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరమని, వాటిని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించినా అది వాణిజ్య దోపిడీ కిందికే వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. అంగీకారం లేకుండా మహిళల ఫొటోలు ప్రకటనల్లో వాడుతున్నారనే నమ్రత అంకుశ్ అనే మహిళ పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈ నెల 24లోగా సమాధానం చెప్పాలని కేంద్రం, తెలంగాణ, MH, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఇతరులకు ఆదేశాలిచ్చింది.

News March 18, 2025

రాజవొమ్మంగిలో యువతి ఆత్మహత్య

image

రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకి చెందిన ఆర్.సంజనా ప్రియ (19) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని సీఐ సన్యాసినాయుడు సోమవారం రాత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు వంట చేయకుండా టీవీ చూస్తున్న యువతిని మందలించారు. అనంతరం యువతి క్షణికావేశంలో గడ్డిమందును తాగింది. కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందజేస్తుండగా మృతి చెందిందని సీఐ చెప్పారు.

error: Content is protected !!