News February 11, 2025

రావులపాలెం జొన్నాడ బ్రిడ్జి కింద మహిళ మృతదేహం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం బ్రిడ్జి కింద మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు రావులపాలెం ఎస్సై చంటి తెలిపారు. స్థానిక వీఆర్వో ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మహిళ 5,4 పొడవు, నీలి రంగు చీరతో ఉందన్నారు.

Similar News

News February 11, 2025

హైదరాబాద్‌లో రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్ సీజ్..

image

హైదరాబాద్‌లో విదేశీ సిగరెట్ల గుట్టును కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సౌత్ వెస్ట్ జోన్, హాబీబ్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రట్టు చేశారు. రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అఫ్సల్ నగర్, అగపురా రోడ్డులో ఓ గోదాంలో విదేశీ సిగరేట్స్ నిల్వ ఉంచారు. ఈ మేరకు నిందితులు ఇమ్రాన్, ఆయుబ్‌ను అరెస్ట్ చేశారు.  

News February 11, 2025

PM ఫ్రాన్స్ పర్యటనలో చేసుకునే రక్షణ ఒప్పందాలివే

image

ఫ్రాన్స్‌నుంచి 26 రఫేల్-ఎం యుద్ధవిమానాలు, 3 స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్లను నేవీ కోసం కొనుగోలు చేయాలని భారత్ సూచనప్రాయంగా నిర్ణయించింది. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఫైటర్ జెట్స్ ఒప్పందం విలువ రూ.63వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. INS విక్రాంత్, INS విక్రమాదిత్య నౌకలపై వీటిని మోహరించనున్నారు. ఇక 3 సబ్‌మెరైన్ల కొనుగోలు విలువ రూ.33,500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.

News February 11, 2025

ప్రభాస్ ముగ్గురు చెల్లెళ్లను చూశారా?

image

దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ముగ్గురు కూతుళ్లు(ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి) బంధువుల పెళ్లిలో దిగిన ఫొటో వైరలవుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ క్రమంలో చెల్లెళ్లంతా కలిసి డార్లింగ్‌కు త్వరగా వివాహం జరిపించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కొడుకే ప్రభాస్. ఇతనికి అన్న ప్రబోధ్(నిర్మాత), సోదరి ప్రగతి ఉన్నారు.

error: Content is protected !!