News March 17, 2025

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

image

ఉమ్మడి కరీంనగర్,​ మెదక్,​ నిజామాబాద్,​ ఆదిలాబాద్​ టీచర్స్​ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మను కలిశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్‌కు విద్యారంగ, టీచర్ల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Similar News

News March 18, 2025

అంతరిక్షం నుంచి వచ్చాక స్ట్రెచర్లపైనే బయటకు..

image

స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సుల్‌లో రేపు తెల్లవారుజామున భూమిపైకి రానున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌పై అందరి దృష్టి నెలకొంది. క్యాప్సుల్ తెరుచుకున్న వెంటనే వీరిని స్ట్రెచర్స్‌లో బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పేస్ నుంచి ఒక్కసారిగా భూమిపైకి రావడం, అంతరిక్షంలో నెలల పాటు ఉండటంతో వీరి శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం కారణమని నిపుణులు చెబుతున్నారు. వీరు నడవలేని స్థితిలో ఉంటారని అంటున్నారు.

News March 18, 2025

‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం: మంత్రి

image

AP: గతేడాది విజయవాడను ముంచేసిన బుడమేరు వాగుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు ప్రారంభించామని మంత్రి నిమ్మల తెలిపారు. ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నిధుల విడుదలకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు సరస్సు వరకు కాలువల ప్రవాహ మార్గం సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతామన్నారు.

News March 18, 2025

భారత్ టెస్టుల్లో పేలవం.. రోహిత్‌దే బాధ్యత: గంగూలీ

image

టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో బాగా ఆడుతున్నా టెస్టుల్లో పేలవమేనని మాజీ క్రికెటర్ గంగూలీ అన్నారు. ‘కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ బాధ్యత తీసుకోవాలి. టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడి సామర్థ్యానికి మరింత మెరుగ్గా ఆడి ఉండాల్సింది. ఇంగ్లండ్‌తో ఆడనున్న టెస్టుల్లో గెలుపులపై రోహిత్ ముందుగానే ప్లాన్ వేయాలి. తెల్లబంతి ఫార్మాట్లలో మాత్రం అతడికి తిరుగులేదు’ అని కొనియాడారు.

error: Content is protected !!